అనపర్తి: అగ్నిప్రమాద బాధితురాలికి జనసేన ఆర్ధికసాయం

అనపర్తి నియోజకవర్గం: పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీపేటలో గతవారం మంగళవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 7నెలల గర్భిణి స్త్రీ మరియు 70సంవత్సరాల వృద్ధురాలి కుటుంబం ఒక చిన్న గుడిసెలో అగ్నిప్రమాదంలో చిక్కుకోగా దురదృష్టవశాత్తు వృద్ధురాలు మరణించి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిన ఇల్లు, కట్టుబట్టలు మాత్రమే మిగిలి ఉన్న ఆ కుటుంబానికి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు వారిని వెంటనే పరామర్శించి, అనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు 10.000/తక్షణ సాయం చేయడం జరిగింది.
అదేవిదంగా సోమవారం జనసైనికులు మరో 10,000 రూపాయిలు సమకూర్చి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతులమీదుగా భాదిత కుటుంబానికి అంద చేసారు.. ఈ కార్యక్రమంలో ఆర్.నాగు, కళ్యాణ్, అశోక్, అరుణ్ కుమార్, సుంకర బుజ్జి, సోమశేఖర్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.