పిడుగురాళ్ల పట్టణంలో బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ

గురజాల: బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల పట్టణం నందు గల 2 వార్డ్ నందు మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన, టిడిపి శ్రేణులు భారీగా పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను, పంచి, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన మండల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.