బహుజన ఐక్య రాజ్యాధికార సాధన సదస్సు

కొవ్వూరు లిటరరీ క్లబ్ నందు జనసేన మరియు భీమ్ సైనిక్ సంయుక్త సారథ్యంలో జరిగిన బహుజన ఐక్య రాజ్యాధికార సాధన సదస్సుకి భారీ స్థాయిలో కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మరియు యువత పాల్గొని 25 సంవత్సరాల భావితరాల వారికి భవిష్యత్తు చూపగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఇందుకు జనసేన పార్టీ మాత్రమే దళిత బహుజనులకు అభివృద్ధిని చూపగలదని సదస్సులో పిలుపునిచ్చి, తీర్మానం చేశారు. జనసేన చేస్తున్న కార్యక్రమం చూసి ఓర్వలేక స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు హోంశాఖ మంత్రి తానేటి వనిత జనసేన కార్యకర్తలు వందలాది మందిని చూసి ఓర్వలేక కొవ్వూరు డిఎస్పి వర్మతో కార్యకర్తలను 30 మంది బెటాలియన్ తో, సీ.ఐ మరియు ముగ్గురు ఎస్సై లతో భయపెట్టి, కేసులు పెడతామని అధికార దుర్వినియోగం చేసి భయపెట్టి దౌర్జన్యం చేయగా, ఇందుకు మా హక్కులను కాలరాస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించగా, వెనక్కి తగ్గారు. ప్రైవేట్ ఫన్షన్ హాల్ నందు లోనకు కూడా వచ్చి సౌండ్ సిస్టంను లాక్కెళ్లి జనసేన పార్టీ కార్యక్రమానికి వీలైనంత అంతరాయం కలగజేశారు. పార్టీ కోసం, ప్రజాశ్రేయస్సు కోసం మా పవన్ కళ్యాణ్ గారు కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యమని జన సైనికులు అందరూ న్యాయవాది తొర్లపాటి షీతల్ నాయకత్వములో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ రామచంద్రరావు, నాయకులు కోటేచంద్రరావు, కొవ్వూరు మండల ప్రెసిడెంట్ సుంకర సత్తిబాబు, టౌన్ ప్రెసిడెంట్ దేహాల రాము, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు ఉత్తమ రైతు గ్రహీత పుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు.