ప్రమాదవశాత్తూ గాయపడిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

టెక్కలి, అది ఆంద్ర వీధికి చెందిన దేవాది గోపాల్ రావు ఇటీవల కాలంలో గ్రానైట్ క్వారీలో గాయపడి ఇంటికే పరిమితమై ఇద్దరు ఆడపిల్లలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో టెక్కలి జనసేనపార్టీ తరుపున 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు మరియు వైద్యం కోసం చిరు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కూరకుల యాదవ్ మెట్ట అవినాష్, ఎంపీటీసీ అభ్యర్థి సునీల్ పసుపురెడ్డి సోమేశ్, తోట శ్యాం, కిర్రి చిరంజీవి, కిర్రి శ్రీను, దాసరి సంతోష్, దండాసి డిల్లేశ్వరరావు, ఉర్జాన జాన్, దండాసి కార్తిక్ పాల్గొన్నారు. మంచి సమాజం కోసం జనసేనపార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు.