వైభవంగా బండారు శ్రీనివాస్ జన్మదిన వేడుక

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ, నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ కు ఆదివారం పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, బంధువులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమాని సంఘం నాయకులు కార్యకర్తలు, చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధర్మ తేజ్, నాగబాబు అభిమాన సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎంతో పెద్ద ఎత్తున వైభవంగా బండారు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఆదివారం వాడపాలెం వారి స్వగృహం నందు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నాయకులు తో కలిసి, అతి భారీ ఎత్తున పోటెత్తిన జన సందోహం మధ్యన ఘనంగా పుట్టిన రోజు వేడుకలు బండారు శ్రీనివాస్ ఆనందంతో జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు, నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు బండారు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తమ అభిమానాన్ని, స్నేహంను, ఆత్మీయతను ఘనంగా చాటుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి, పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని, మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, నాకు, నా కుటుంబానికి ప్రతి ఒక్కరి అండదండలు కావాలని, ఈ సందర్భంగా కోరుతూ, ఎంతో ఆనందంతో, కోలాహలంతో కన్నుల పండుగగా, పలువురు పెద్దల దీవెనలు ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యంగా బండారు శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి గల్ఫ్ దేశం లో ఉంటున్న ప్రముఖ ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, బెహరిన్ నుంచి వచ్చి శుభాకాంక్షలు ఘనంగా అందజేశారు. వీరితో పాటు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, వైస్ అధ్యక్షులు మండల, గ్రామ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.