బెంగళూరు సూపర్‌ విక్టరీ

ఐపీఎల్‌-13 సీజన్‌లో సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య రసవత్తర పోరు జరిగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడంతో మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో బెంగుళూరు విజయం సాధించింది.

సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై వికెట్‌ కోల్పోయి 7 రన్స్ చేసింది. నవదీప్‌ సైనీ బౌలింగ్‌ చేయగా హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ బ్యాటింగ్‌ చేశారు. నాలుగో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ బాది తర్వాతి బంతికి పెవిలియన్ చేరాడు. 8 పరుగుల టార్గెట్ తో ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ బరిలో దిగారు. తొలి బంతికి సింగిల్‌ తీసిన డివిలియర్స్‌ నాలుగో బంతికి ఫోర్‌ బాదాడు. ఐదో బంతికి కూడా సింగిల్‌ తీయడంతో స్కోర్‌ సమమైంది. ఆరో బంతికి కెప్టెన్‌ కోహ్లీ సింగిల్‌ తీసి బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు.

ఛేజింగ్ లో ముంబై ఓటమి దాదాపు ఖాయం అనుకుంటున్న సమయంలో యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌( 99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్బుత పోరాటం చేడంతో మ్యాచ్ టై అయింది. సోమవారం బెంగళూరుతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 201 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో బెంగుళూరును విజయం వరించింది.

ముంబై ఇండియన్స్‌ భారీ ఛేదనలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించినా చివరకు సూపర్‌ ఓవర్‌లో దురదృష్టం వెంటాడింది. ముంబై తరఫున యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99), పొలార్డ్‌ (24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్‌) వీరోచితంగా పోరాడినా ఫలితం దక్కలేదు.