నష్టపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలి: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం నియోజకవర్గంలో తుఫాను, కరువు నష్టాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతంలో నష్టపోయిన ప్రతి రైతును తక్షణమే ఆదుకోవాలి, తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 20 వేల రూపాయలు తక్కువ కాకుండా ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం అందజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కళ్ళాల్లో తడిచిపోయిన ధాన్యాన్ని షరతులు లేకుండా బేషరతుగా ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి నష్టపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులని పరామర్శించిన తీరు వింతగా విడ్డూరంగా ఉంది. రైతులు పట్ల చిత్తశుద్ధి లేకుండా ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.