బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటీలకు ముఖ్య అతిథులుగా బత్తుల దంపతులు

రాజమహేంద్రవరం, ఎస్.కె.వి.టి కాలేజ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటీలకు ముఖ్య అతిథులుగా రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ దేశానికి తక్కువ సమయంలో ఖ్యాతిని తీసుకొచ్చే రంగం క్రీడారంగమని పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడాకారిణి బాగా రాణించాలని దేశం గర్వించదగ్గే స్థాయికి అందరూ ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలియజేశారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారుల ఆహార పదార్థాలకు బత్తుల బలరామకృష్ణ ఆర్థిక సహాయం అందించారు.