శరన్నవరాత్రి వేడుకల్లో బత్తుల దంపతులు

రాజానగరం, నందరాడ గ్రామంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం రాజమహేంద్రవరం, జవహర్ లాల్ నెహ్రూ రోడ్ లో స్వర్ణదుర్గ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాలలో కమిటీ సభ్యులు గేదెల పూర్ణచంద్ర, రేలంగి శ్యామ్ సుందర్, నల్లంశెట్టి వీరబాబుల ఆహ్వానం మేరకు దేవి మండపానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు మేడిశెట్టి శివరాం మరియు రాజు, దొరబాబు, సత్తిబాబు, బాదం రమణ, సతీష్, బి. ప్రసాద్, కె. వెంకటేష్, టి. వీరభద్రరావు, వి. సతీష్ నందరాడ గ్రామ ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.