పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు

  • అశ్రునయనాలతో ఘన నివాళులు
  • రూపాయలు ₹5,000/- ఆర్థిక సహాయం

రాజానగరం, కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రసాద్ భార్య నాగమణి మరణించిన విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి కుటుంబ ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయలు, 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కారక్రమంలో జనసేన నాయకులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన బత్తుల

కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి చెందిన అడ్డాల నాగన్న భార్య బేబీ ఇటీవల నిర్యాణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర గారు, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • బుచ్చింపేట గ్రామ కరణానికి బత్తుల పరామర్శ

కోరుకొండ మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన కరణం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకున్న జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాబోవు రోజుల్లో కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర గారు, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • యాక్సిడెంట్ కు గురైన అనపర్తి రామకృష్ణ భార్యను పరామర్శించిన బత్తుల

కోరుకొండ మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన అనపర్తి రామకృష్ణ భార్యకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు అత్తి సీతారాములు, బేలే వెంకటేసులు, బత్తుల రాంబాబు, మన్యం అరవరాజు, గంగిశెట్టి వెంకన్న, మన్యం వెంకన్న, నర్రావుల వీరబాబు, ఏనుగంటి రాంపండు, జనసేన నాయకులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • సాంబేలపు విష్ణు కుటుంబానికి బత్తుల పరామర్శ

సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామానికి చెందిన సాంబేలపు విష్ణు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయం తెల్సుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ తోడుగా అండగా ఉంటుందనే భరోసాని ఇచ్చారు. ఈ కారక్రమంలో జనసేన నాయకులు యేసుపాదం, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కవల గంగారావు, సత్యనారాయణమూర్తి, అడ్డాల అంజి, ప్రగాఢ రాజు, శ్రీహరి, హరిదాసు, వెంకటకృష్ణ, సాంబేలపు దుర్గారావు, సాంబేలపు సురేష్, అడ్డాల శ్రీను మరియు ఇతర నాయకులు, జనసైనికులు, రఘుదేవపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

  • సత్యం దశైకాపు కుటుంబానికి బత్తుల పరామర్శ

సీతానగరం మండలం, ఇనుగంటి వారిపేట గ్రామానికి చెందిన మాజీ సొసైటీ ప్రెసిడెంట్ సత్యం దశైకాపు ఇటీవల మృతి చెందిన విషయం తెల్సుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కారక్రమంలో జనసేన నాయకులు యేసుపాదం, కొత్తపల్లి రఘు, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు మరియు గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • ఆళ్ళపాటి తాతారావు కుటుంబానికి బత్తుల దంపతుల భరోసా

సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన ఆళ్ళపాటి తాతారావు కిడ్నీలు పాడవటం వల్ల డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యం వలన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, బండి సత్యప్రసాద్, యేసుపాదం, కొత్తపల్లి రఘు, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకుల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • మందేలు సుబ్బలక్ష్మి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందించిన బత్తుల

సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన మందేలు సుబ్బలక్ష్మికి ఇటీవల కాళ్ళకి ఆపరేషన్ జరగ్గా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించి, ప్రస్తుత ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మనోధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, బండి సత్య ప్రసాద్, యేసుపాదం, కొత్తపల్లి రఘు, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకుల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ మరియు గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • ఏరేటి శ్రీను కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు

సీతానగరం మండలం నల్లగొండ గ్రామానికి చెందిన ఏరేటి శ్రీను అత్తయ్య ఇటీవల స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, బండి సత్యప్రసాద్, యేసుపాదం, కొత్తపల్లి రఘు, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకుల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ, ముడిస అంబేద్కర్, నందే శ్రీనుబాబు మరియు గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • బందిలి వీర్రాజు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు

సీతానగరం మండలం, నల్లగొండ గ్రామానికి చెందిన బందిలి వీర్రాజు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు వారి ఇంటికి వెళ్లి మనోధైర్యంతో ఉండమని, వీర్రాజు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాబోవు రోజుల్లో జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని చెప్పి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయంగా రూపాయలు ₹5,000/- రూపాయలను ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం కుటుంభ సభ్యులకు అందించి, తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, బండి సత్య ప్రసాద్, యేసుపాదం, కొత్తపల్లి రఘు, మాగారపు సత్తిబాబు, కిమిడి శ్రీరామ్, గుల్లింకుల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ, ముడిస అంబేద్కర్, నందే శ్రీనుబాబు మరియు గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.