అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

విజయనగరం: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ 27, సోమవారం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడునని అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మార్చ్ 27, సోమవారం ఉదయం 7:00 గంటలకు కామాక్షీ నగర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం 8:00 గంటలకు కామాక్షీ నగర్ శ్రీ ప్రసన్న స్కూల్ ల్లో నేత్ర వైద్య శిబిరం, 9:00 ఆం: కేక్ కటింగ్, 11:00 ఆం: మొక్కలు నాటే కార్యక్రమం, 12:30 ఫం: పట్టణంలో పలు ప్రాంతాల్లో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేఅబడును, నేత్ర వైద్య శిబిరాన్ని ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రముఖ సంఘ సేవకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గురాన అయ్యలు గారు ఉదయం 8 గంటలకు నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించి, అనంతర కేక్ కటింగ్ చేస్తారు.. మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసైనుకులు, వీరమహిళలు, జనసేన నాయకులు విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని బాలు మనవిచేసారు.