ఎలక్ట్రికల్ పోల్స్ సమస్య పరిష్కరించిన దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజవర్గం, 64 వ వార్డు, గంగవరం గ్రామం దారి వీధి ఎజ్జల ధనరాజు, సుక్క సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా వీధిలో ఎలక్ట్రికల్ పోల్స్ తక్కువ ఉన్నాయని, అందువలన మేము ఇబ్బంది పడుతున్నామని, ఇంకా నాలుగు ఐదు ఎలక్ట్రికల్ పోల్స్ అవసరం ఉంటుందని కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ అక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సమస్య క్లియర్ చేశారు. స్థానికులు గోవిందరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య, మెగా నూకరాజు, పెల్లేటి దేవుడు, బాలు, ఆది, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.