కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ (వడ్రంగి) అసోసియేషన్ వారి నూతన క్యాలెండర్ ను విశ్వ బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు కార్పెంటర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొచ్చర్ల సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, విశ్వబ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.