దివ్యాంగుల అభయ యాత్ర

కాకినాడ సిటి, జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో దివ్యాంగుల అభయ యాత్రా కార్యక్రమం సహాయ కార్యదర్శి కంట రవిశంకర్ ఆధ్వర్యంలో రేచర్ల పేట ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని జనసైనికులు దివ్యాంగులు సామంతుల చంద్రకళ మరియు పెమ్మాడి సత్తిబాబుల ఇళ్ళకు వెళ్ళి వారిని కలిసి వారి కుటుంబానికి వారు భారం కాదనీ వారే కుటుంబానికి ఆధారం అయ్యేలా చేస్తామని ఇది తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అభయంగా వారికి భరోసానిచ్చారు. నగరంలో సుమారు 3 వేల మంది దివ్యాంగులుగా అధికారికంగా గుర్తింపుని కలిగి ఉన్నారనీ, ఇంకా సుమారు 1500 మందికి గుర్తింపు పరిగణనలోకి తీసుకోవాలనీ, రాబోయే తమ జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చాకా ఆరునెలలలోపు దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటాదని అన్నారు. అలాగే నగరంలోని దేవాలయాలకు & మునిసిపాలిటీలకు చెందిన వ్యాపార సముదాయాలలో 25 శాతం వీరికి కేటాయించేలా పోరాడతామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కంట రవిశంకర్, పచ్చిపాల మధు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.