పలు ఆత్మీయ పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: నియోజకవర్గ పరిధిలో పలు ఆత్మీయ పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన రాజానగరం నియోజకవర్గ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ. ముందుగా రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన సక్కూర సత్యనారాయణ, రామకృష్ణ, సూరిబాబు, రాంబాబు, లక్ష్మణరావు తండ్రి కీ.శే. సక్కూర వెంకట్రావు శివైక్యం చెందిన కారణంగా వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాజానగరం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కలిగించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన గుల్లింకల సత్యనారాయణ, సూరిబాబు తండ్రి కీ.శే గుల్లింకల చక్రయ్య శివైక్యం చెందిన కారణంగా వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాజానగరం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కలిగించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బలరామకృష్ణతో పాటు రాజానగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సంగిశెట్టి సతీష్, గుల్లింకల ఆంజనేయులు, సంగిశెట్టి శ్రీనివాస్,ఆనంద్దేవుల సూరిబాబు, రామిశెట్టి సతీష్, పుచ్చల సాయి, మేడిద లోవరాజు, కేశంశెట్టి రామకృష్ణ, గద్దె అయ్యప్ప మరియు జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.