రఘునాథపురంలో భారీ జనసంద్రంతో సాగిన బత్తుల రోడ్ షో

  • మండుటెండను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిన రోడ్ షో ప్రచార కార్యక్రమం
  • జనసంద్రంలా కదిలొచ్చిన ప్రజానీకం
  • గ్రామంలో శివాలయంలో స్వామి వారిని దర్శించి ప్రచారం ప్రారంభించిన బత్తుల
  • అడుగడుగునా హారతులతో బ్రహ్మరధం పట్టిన మహిళాలోకం

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రఘునాథపురం గ్రామంలో భారీ జనసంద్రంతో మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.