పలువురిని పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన బొమ్ముల రాజు సతీమణి దుర్గాదేవి అనారోగ్యంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్నారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన నిడదవోలు మల్లేశ్వరావు హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎంసీ హెచ్.ఓ.డి పి.వి.వి సత్యనారాయణని కలిసి వారితో మాట్లాడి సరైన వైద్యం అందించాలని సూచించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఉన్నారు.