కానవరం గ్రామంలో మానవత్వం చాటుకున్న బత్తుల

  • 30,000 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం, 6 రైస్ బ్యాగుల వితరణ

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను అనునిత్యం రాజానగరం నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ, చేరువచేస్తూ మరోపక్క అనేక ఇబ్బందులతో, అనేక రకాల బాధలు అనుభవిస్తున్న బాధిత కుటుంబాలను ఓదారుస్తూ సందర్భాన్ని బట్టి చేతనైనంత ఆర్థిక సహాయాలు అందిస్తూ ప్రజా హృదయాలు గెలుచుకుంటున్న పుణ్యదంపతులు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి. రాజానగరం మండలం, ‘కానవరం’ గ్రామంలో నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సుడిగాలి పర్యటన చేస్తూ అనేక ఇబ్బందులతో బాధలు అనిపిస్తున్న పలువురు బాధిత కుటుంబాలను ఓదారుస్తూ కొంత ఆర్థిక సహాయం అందిస్తూ.. మరోమారు తన ఔదార్యాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సంగిశెట్టి వెంకటేశులు అలియాస్ పెద్దకాపు చేతికి గాయంతో ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం కానవరం జనసేనశ్రేణుల ద్వారా తెలుసుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి, కోలుకుంటున్న విధానంపై క్షుణంగా అడిగి తెలుసుకుని కుటుంబ ఖర్చులు నిమిత్తం 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల రైస్ బ్యాగ్ అందించడం జరిగింది.. అదేవిధంగా గ్రామవాసి సంగిశెట్టి నాగేశ్వరావు అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పరామర్శించి, మనోధైర్యం కల్పించి వైద్య ఖర్చులు నిమిత్తం₹5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం 25 కేజీల రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. అనంతరం బీసీ సామాజిక వర్గానికి చెందిన దాలపత్తి రాజు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారన్న సమాచారం తెలవడంతో వారిని పరామర్శించి, ధైర్యం కల్పించి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. అనంతరం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాలపాటి లక్ష్మి భర్త విజయ్ అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారన్న విషయం తెలుసుకుని.. ఆ కుటుంబాన్ని పరామర్శించి, డాక్టర్లు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ 5,000 వేల రూపాయలు ఆర్థిక సాయం, 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. అనంతరం బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని అన్నవరం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించి, వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ పై ఆరా తీసి, వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. మరియు ఎస్సీ సామాజిక చెందిన వర్గానికి చెందిన పిలిపే గనిక పేదరికం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పలకరించి. జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిస్తూ 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి తో పాటు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, సూర్యారావుపేట ఎంపీటీసీ వల్లభశెట్టి వెంకటరమణ (అలియాస్ డబ్బు), సంగిశెట్టి సతీష్ , అన్నందేవల సూరిబాబు, సంగిశెట్టి శ్రీను (దొండ) కేసంశెట్టి రామకృష్ణ, సంగీత చిన్నోడు, సంగీత వరప్రసాద్, రామిశెట్టి సతీష్, గుజారపు నరసింహ, గుజారపు అరవింద్, గుల్లింకల రాంబాబు, సంగిశెట్టి శివ, సంగీత చక్రవర్తి, సత్యంశెట్టి వెంకటేశులు, పడాల శివ, గళ్ళ అర్జున్, గుల్లింకల సత్యనారాయణ, సంగిశెట్టి వెంకట్రావు, గుజారపు వెంకన్న బాబు, గుజారపు కుమార్, సంగిశెట్టి సూరిబాబు, మెడిద వెంకన్న బాబు, మద్ద వెంకటేష్, గుజారపు కృష్ణ, సంగీత వెంకన్న, సంగిశెట్టి వెంకన్న, పాలవాట్టి మహేష్, కోడి జాను, మేడిద రాంబాబు, జ్యోతుల శివ, మద్దా పవన్ మరియు కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, కురుమళ్ళ మహేష్, గంగిశెట్టి రాజేంద్ర, సుంకర బాబ్జి, నాతిపాం దొరబాబు, కమిడి సత్యనారాయణ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.