కోటి గ్రామంలో పలువురిని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామనికి చెందిన సత్తి రాజు భార్య గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆదివారం వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. అనంతరం కోటి గ్రామనికి చెందిన జామి దుర్గా ప్రసాద్ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయాలు పాలయ్యారు. విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జామి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి & బత్తుల కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని నాకు ప్రమాదం జరిగిన సమయంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పేద ప్రజల కోసం పెట్టిన అంబులెన్స్ లోనే మూడు సార్లు వైద్యం కొరకు తీసుకెళ్లడం జరిగింది. కావున నాకు చేసిన సాయానికి వారికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానని అన్నారు. కోటి గ్రామనికి చెందిన జనసేన పార్టీ సభ్యుడు నండూరి నాగు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయాలు పాలయ్యారు. నే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. కోటి గ్రామనికి చెందిన మడక అక్కమ్మ గత కొన్ని రోజుల క్రితం చనిపోయారు అనే వార్త స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తన్నీరు తతాజీ, మద్దిరెడ్డి బాబులు, నాతిఫామ్ దొర బాబు, తెల్లమేకల శ్రీను (ఆరెంజ్), యర్రంశెట్టి పోలరావు, కోటి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చదువు నాగేంద్ర, నండూరి ఆంజనేయులు, నండూరి దొరబాబు, చదువు ముక్తేశ్వరావు, చదువు నాగేశ్వరరావు, అడపా రమణ, గణశాల వీరబాబు, నండూరి సూరిబాబు మరియు పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు పాల్గొన్నారు.