50 వేల మంది భాగస్వాములు కావాలని బత్తుల పిలుపు

  • ఉధృతంగా కొనసాగుతున్న “నా సేన కోసం నా వంతు”

రాజానగరం, ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ నుండి 50 వేల మంది భాగస్వాములు కావాలి బత్తుల పిలుపునిచ్చారు. రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో జరిగిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… జనసేన పార్టీ ఆర్థిక పరిపుష్టికి అందరూ సహకరించాలని, తద్వారా ప్రజా కార్యక్రమాలు సజావుగా సాగడానికి వీలు కలుగుతుందని బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. అనంతరం రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… రాజానగరం నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమంలో తక్కువంటే 50వేల పైచిలుకు భాగస్వాములు కావాలని, ఎంత ఇచ్చామన్నది కాకుండా ఎంతమంది భాగస్వాములు అయ్యారు అన్నదే ముఖ్యమని, పార్టీ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు జరిగిన ‘మహా రక్తదాన శిబిరం’ కార్యక్రమంలో లెక్కకు మించి జనసేన పార్టీకి అనుసంధానమైన బ్యాంక్ కు ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా వందలాదిమంది ఆర్థిక సహాయం పంపించడం జరిగిందని అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు జల్సా సినిమాని రెండు షోలు అభిమానులు కోరిక మేరకు ఉచితంగా ప్రదర్శించి ఆ థియేటర్ వద్ద అభిమానులను పార్టీ ఖాతాకు మీకు తోచిన విధంగా విరాళాలు పంపించాలని పిలుపునివ్వగా వందలాది జనసైనికులు సంబంధిత ఖాతాకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారని అలాగే ప్రతిరోజు జరిగే జనంకోసం జనసేన మహా పాదయాత్రలో అందరికీ ఇదే విషయం వివరించడం జరుగుతుందని వారు వారికి తోచిన విధంగా జనసేన ఖాతాకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారని, రానున్న రోజుల్లో నియోజవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద యజ్ఞంలో తీసుకెళ్లే వేలాదిమందిచే పార్టీకి విరాళాలు ఇచ్చే విధంగా కృషిచేసి ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు జనసైనికులు, గాడల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.