జనసేన తీర్ధం పుచ్చుకోనున్న పాలకొల్లు కోకోనట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇనుకొండ రంగారావు

పాలకొల్లు, ఆదివారం ఉదయం వేడంగి గ్రామ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ బన్నీ వాసు పాలకొల్లు కోకోనట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇనుకొండ రంగారావు ని వారి స్వగృహంలో కలవడం జరిగింది. ఆయన లాంటి పెద్దలు గ్రామంలో జనసైనికులను ముందుండి నడిపించి, మార్గ నిర్దేశం చేయాలని కోరడంతో దానికి ఆయన సుముఖంగా స్పందించడం జరిగింది. అతి త్వరలోనే అధికారికంగా ఆయన పార్టీ తిర్థం పుచ్చుకోనున్నారన్న వార్త ఇటు జనసైనికులలోను మరియు నాయకులలోను మరింత ఉత్సాహాన్ని నింపింది.