డ్రైనేజీలకు బ్లీచింగ్ చేయండి

ఉరవకొండ: బెలుగుప్ప మండల కేంద్రంలోని రోడ్డు ప్రక్క కాలువలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల దోమలు పెరిగిపోయి విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాబట్టి పక్క కాలువల్లో అపరిశుభ్రంగా ఉన్న వ్యర్థాన్ని తీసేసి సైడ్ కాలువలు, మురుగునీరు నిలబడి ఉన్న చోట్ల బ్లీచింగ్ మరియు ఫాగింగ్ చేసి దోమల నిర్ములనపై వెంటనే చర్యలు చేపట్టాలని బెలుగుప్ప గ్రామ కార్యదర్శి వెంకటేష్ కి బీజేపీ, జనసేన మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, కాశంశెట్టి సుధీర్ వినతిపత్రం అందజేశారు. కార్యదర్శి వెంకటేష్ వీరికి ఒక వారంలో గ్రామం మొత్తం బ్లీచింగ్ మరియు ఫాగింగ్ చేయిస్తామని హామీ ఇచ్చారు.