తిరుపతిలో సామాన్యులు రాజకీయం చేయకూడదా?

  • చేస్తే ఆ కుటుంబానికి నచ్చదా
  • జనసేన పై కుల ముద్ర వేయకండి
  • రాయల్ అన్నది పేరు కాదు, బ్రాండ్
  • వైసిపి చేసే సాధికారత యాత్రలో న్యాయం లేదు
  • జనసేన పార్టీ తీవ్ర విమర్శలు

తిరుపతి: పాలక వైకాపా చేసే సామాజిక సాధికారత యాత్రలో న్యాయం లేదని రెడ్డి పాలన కొనసాగుతున్నదని, ఏ డిపార్ట్మెంట్లో చూసిన రెడ్డి సామాజిక వర్గమే ఏలుతు న్నదని మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏమయ్యారని జనసేన నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వారు మాట్లాడుతూ.. సాధికారత యాత్ర అంటే అన్ని కులమతాలకు న్యాయం చేసేలా ఉండాలని అన్నారు. కానీ ఇక్కడ ఒకే కలానికి చెందిన వారికే న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అంటే అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అని కొనియాడారు. త్వరలో రాబోయేది జనసేన, టిడిపి పాలనని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ 1999లో తాను రాయల్ యూత్ అని కొందరితో కలిసి స్థాపించామని, తనను చిన్న వయసు నుంచే కిరణ్ రాయల్ గా పిలిచేవారని, నేడు వైసీపీలోని బలిజ కులస్తులు రాయల్ అనే బ్రాండ్ ను వాడుకొని లబ్ధి పొందుతున్నారని, రాయల్ అన్నది పేరు కాదు బ్రాండ్ అని అది తీసుకొచ్చింది మేమేనని దుయ్యబట్టారు. వైసిపి దుర్మార్గ పరిపాలన నుండి ప్రజలు విముక్తులు కానున్నారని రానున్నది జనసేన టిడిపి ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు బాబ్జి, మునుస్వామి, కిషోర్, పార్ధు, వీరామహిళ, రాజేంద్రలు పాల్గొన్నారు.