తలసేమియా వ్యాధి భాదితుల కోసం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మధిర నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేయబోయే రక్తదాన శిబిరంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, విద్యార్థి విభాగ నాయకులు, యువజన విభాగ నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ కోరారు. రక్తదాన శిబిరంలోఅందరు పాల్గొని తల సేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ చేసి తల సేమియా పిల్లలను కాపాడుకుందాం. మరియు ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమయం: ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుంది.
స్థలం: శ్రీ కృష్ణ ఎంటర్ ప్రైజెస్, ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన, విజయవాడ రోడ్ -మధిర, ఖమ్మం జిల్లా.