పాడేరు జనసేన కార్యాలయంలో స్టడీ హబ్ ప్రారంభోత్సవం

పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు స్టడీ మెటీరియల్స్, లైబ్రరీ స్పెసిలిటీస్ తో స్టడీ హబ్ ప్రారంభం కాబోతున్నది. ఔత్సాహికులు, గిరిజన నిరుద్యోగ యువతి, యువకులు, జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు పాల్గొని, గిరిజన నిరుద్యోగ యువత కొరకు స్టడీ హబ్ ఘనంగా ప్రారంభోత్సవంచేసి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాడేరు, అరకుపార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా..వంపురు గంగులయ్య, పిలుపునిచ్చారు.