ఇచ్ఛాపురం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఇచ్ఛాపురం, పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సుమారు నాలుగు సంవత్సరాల కాలంలో తిప్పన దుర్యోధన రెడ్డి జనసైనికులు సాయంతో 5000 మందికి పైగా రక్తదానం చేయించడం జరిగింది. బుధవారం ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీలో ఇన్నేసుపేట దుంగు భాస్కర్ రెడ్డి మరియు గ్రామ జనసైనికుల సహాయంతో బ్లడ్ క్యాంప్ నిర్వహించి సుమారు 51మందికి పైగా రక్తదానం చేశారు. ఇప్పటి వరకు 6 బ్లడ్ క్యాంప్ లు నిర్వహించడం జరిగింది. రక్తదానం క్యాంపుకి ముఖ్య అతిథులుగా జనసేన పార్టి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు, మత్స్యకార విభాగం నాగుల హరి బెహరా ఈ కార్యక్రమం జరిగింది. జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో రక్తం అందక ఎవరూ కూడా మరణించకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో జనసైనికుల సాయంతో రక్తం అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు జనసేన వీర మహిళలు జనసైనికులు అభిమానులు.