యాదవుల ఆత్మీయ సమావేశంలో బొలిశెట్టి, కూటమి నాయకులు

బొలిసెట్టిని అఖండ మెజారిటీతో గెలిపించండి: సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మారిశెట్టి ఫంక్షన్ హాల్ నందు గూడెం నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన, తెలుగుదేశం, బిజెపి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, సినీ నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం నీలపాల దినేష్ కుమార్ యాదవ్ కాళ్ళ గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముందుగా యాదవ కుల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధికులు యాదవులు ఉన్నారని, మా సమస్యలు తీర్చే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ అని నమ్ముతున్నామని ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో శ్రీనివాసను గెలిపించుకుంటామని తెలిపారు. మాకు ఉన్న సమస్యల్లో గొర్రెల మేకల పెంపకంలో కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని వ్యాధులతో తక్కువ సమయంలో అవి మరణిస్తున్నాయని, దాని వలన ఎంతో మంది నష్టపోతున్నారని అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆర్థికంగా ప్రభుత్వం నుండి ఆదుకోవాలని కోరారు చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగారు. గత ప్రభుత్వాల్లో ఏ నాయకులు మాకు సరైన న్యాయం చేయలేదన్నారు. అలాగే నియోజకవర్గంలో మా సామాజిక వర్గానికి కళ్యాణమండపం కట్టించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి, కూటమి నాయకులు మాట్లాడుతూ యాదవులు అంటేనే కృష్ణుడు అంశలో పుట్టిన వారిని యాదవులు సమస్యలు ఏమి ఉన్న ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే తీరుస్తామని తెలిపారు అలాగే మీరు చెప్పిన సమస్యలు అతి చిన్నవని ఇవే కాకుండా మీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు గొర్రెల పెంపకం దారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు గత ప్రభుత్వాలు మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని ఎలా దోసుకున్నాయో ప్రజలందరికీ తెలుసు అన్నారు దేశంలో మోడీ పాలన అద్భుతంగా ఉందని కానీ జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుందని అన్నారు ఇసుక, మద్యంలో అవినీతి తార స్థాయికి చేరిందన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు అన్నారు ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్ నిధులు అన్నీ కూడా మళ్లింపులు జరిగేయి అన్నారు రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది అన్నారు. పెద్ద కంపెనీలైన అమర్ రాజా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిందన్నారు. ప్రతి ఒక్కరు ఈ జగన్ దుర్మార్గపు పాలన అంత చేయాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మాట్లాడుతూ యాదవులు ఉదయాన్నే తిరుమల శ్రీవారి తలుపులు తీసి వారి సేవ తోనే శ్రీనివాసుడు అలంకరణలు చేయడం యాదవులతోనే మొదలవుతుందని కొనియాడారు. బొలిశెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ ఇటు నియోజకవర్గంలోనూ అటు రాష్ట్రం దేశంలోనూ యాదవులకు అండగా ఉంటారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన నాకు బొలిశెట్టి మంచితనం తెలుసునన్నారు. బాబ్జి తాతాజీ సుపరిచితులే అని తెలిపారు రాష్ట్రంలో అద్వాన జగన్ పాలన ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం కష్టపడుతున్న తీరును కొనియాడారు. సొంత డబ్బులతో కౌలు రైతులు ను ఆదుకున్నారన్నారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అని రాష్ట్రం అతని హయాంలో అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. బొలిశెట్టి పదవిలో లేనప్పుడే కరోనా సమయంలో ప్రజలను సొంత సొమ్ములు ఖర్చుపెట్టి ఆదుకున్నారన్నారు. ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు బొలిశెట్టిన సాయం అడిగితే చేతికి ఎముకే లేదన్నట్టుగా సాయం చేసే మనిషి అని కొనియాడారు. ప్రజలందరూ ఇటువంటి మంచి వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.