వెంకటాచలం రైల్వే గేటు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తిచేయాలని జనసేన డిమాండ్

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలంలోని రైల్వే గేటు మరమ్మత్తుల కారణంగా నెలరోజుల నుండి మూతపడి ఉన్న గేటు వద్ద త్వరితగతిన రిపేర్ చేయాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. వెంకటాచల సత్రంలోని నేషనల్ హైవే నుంచి సర్వేపల్లి మీదుగా చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలకు వెళ్లే రైల్వే గేటు గత నెల నుంచి రైల్వే ట్రాక్ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే సర్వేపల్లి చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల ప్రజలు నెల్లూరు నగరానికి వెళ్లాలంటే గొలగమూడి మీద వెళ్లే పరిస్థితి. అయితే గొట్లపాలెం నుంచి గొలగమూడికి వెళ్లే మార్గమధ్యలో ఐదు కిలోమీటర్ల రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. కనీసం రాజకీయ నాయకులు ఎవరూ కూడా ప్రజల అవస్థలని ప్రజా సమస్యలని పట్టించుకోవడం గాని, ఆ ఐదు కిలోమీటర్ల రోడ్డుపై ఉన్న గుంటలను పుడ్చాలనే ఆలోచన గాని, రాకపోవడం సిగ్గుతో కూడిన విషయం. ఈ విషయంపై ఎన్నోసార్లు జనసేన పార్టీ గళాన్ని వినిపించాం. రోడ్డుపైన నిరసన కూడా చేసాం కానీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయన కనీసం ఐదు కిలోమీటర్లు రోడ్డు వేయాలి అనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం. అదే విధంగా ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతూ స్కూటర్లు, ఆటోలు, కార్లు, బస్సులు తదితర వాహనదారులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉంటే కనీసం గేటుని రిపేర్ చేయించడం లేదంటే. ఆ రోడ్డుపైన ఉన్న గుంటలను పూడ్చాలనిలని ఆలోచన లేని పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి, రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్లకు అండగా నిలబడటం ఆ సమస్యలను త్వరితగతన పరిష్కరిస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం. వెంకటాచల మండలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి సొంత మండలం ఈ సొంత మండలంలోని వెంకటాచలం రైల్వే స్టేషన్ ఆయనకి ప్రత్యేక రైలు వచ్చి ఆగే స్టేషన్ మరి ఈ స్టేషన్ పరిధిలో ఉన్న గేటు నెల నుంచి పనులు జరుగుతున్నాయి. మరి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి, ఎందుకని దీనిపైన ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇకనైనా పాలకులు కళ్ళు తెరిచి ఒకసారి ప్రజా సమస్యలను పరిష్కరించే దానికి దృష్టి పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ఖాజా, చెంచయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.