పల్లెల అభివృద్ధిని విస్మరించిన వైసీపీ.. జనసేన పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

  • రాష్ట్రం అభివృద్ధి జనసేనతోనే సాధ్యం
  • బడుగు, బలహీన వర్గాలను వైసిపి ప్రభుత్వం ఓటు బ్యాంక్ లాగానే చూస్తుంది

తాడేపల్లిగూడెం: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి రాష్ట్రంతో పోల్చుకుంటే పట్టణాలోనే కాకుండా పల్లెల్లో కూడా చాలా అద్వాన పరిస్థితుల్లో ఉందని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు మండలం, ఉమామహేశ్వర గ్రామంలో సోమవారం జరిగిన పల్లెపోరులో ముందుగా స్థానిక నాయకులతో బాబు జగ్జీవన్ రామ్ మరియు డా బి.ఆర్. అంబేడ్కర్ లకు నివాళులర్పించి, వీరి ఇరువురి సాక్షిగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని అన్ని వర్గాల హితం, అట్టడుగు వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని దూరదృష్టితో రచించారని కొనియాడారు. అంబేద్కర్‌ కృషి వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు హక్కులు, సంక్షేమ పథకాలను పొందుతున్నారని అన్నారు. కానీ ఈ వైసిపి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఒక ఓటు బ్యాంక్ లాగానే చూస్తుందని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మరియు పట్టణ అభివృద్ధిని కాకుండా పల్లె అభివృద్ధిని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. జనసేన పల్లెపోరులో బాగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఆశయాల గురించి జనాల్లోకి వెళ్లి వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధురత, పెంటపాడు మండలం పల్లెపోరు నిర్వహణ కమిటీ చైర్మన్ చెరుకూరి జగత్ సోమశేఖర్ స్థానిక నాయకులు మర్రిపూడి సుబ్బారావు, మరిపూడి చిన్న, కలబాల సుధాకర్, రాచర్ల సాగర్, కొల్లి వెంకటేష్, కాటన్ బబ్లు, మర్రిపూడి రామారావు, కొల్లి రమేష్, ప్రకాష్, కొల్లు రాజు, బాతు కాంతారావు తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.