గునుగుల కిషోర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే దంపతులకు ఘననివాళులు

  • బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే-జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్

నెల్లూరు: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ లోగల జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం మరియు అంటరానితనం, అస్పృశ్యత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు మొదలైన సమస్యలపై ఎంతగానో పోరాడి కృషిచేసిన మహానుభావుడు అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ, మహిళల పట్ల వివక్ష నిర్ములనకు ఆయన కృషి చేశారని అన్నారు, మహారాష్ట్ర లో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా పూలే ను గుర్తించారని తెలియజేశారు. భారత దేశంలో మహిళల విద్యకు మార్గదర్శకులుగా నిలిచిన ఘనత పూలేకే దక్కుతుందన్నారు. సమాజంలో మార్పు రావాలి అంటే ఒక విద్యతోనే సాధ్యమని గ్రహించి జ్యోతిరావు పూలే తన భార్యకు విద్య నేర్పి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారని అన్నారు. ఆమె ఎందరో స్త్రీలకు విద్య నేర్పించి సమాజంలో పురుషులతో సమానంగా ఎదిగేలా చేస్తారన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే చత్రపతి శివాజీని ఆదర్శంగా భావించే వారున్నారు. ఈ కార్యక్రమంలో వరకుమార్, రాజా, కంతర్, హేమచంద్ర, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.