జనసైనికునికి 55000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న జనసైనికుడు చంద్రశేఖర్ కి ప్రమాదవశాత్తూ కాలు విరిగిపోవడంతో స్థానిక జనసేన శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు ఆపరేషన్ నిమిత్తం యాబై ఐదు వేల రూపాయలు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అంటే కుల మత భేదాలు లేకుండా ఉండే పార్టీ అని, జనసేన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా మేమందరం ముందు ఉంటామని, చంద్రశేఖర్ కి ఆరోగ్యరీత్యా అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.