పలు కుటుంబాలకు అండగా బొలిశెట్టి శ్రీనివాస్

  • గోపిశెట్టి స్వామికి ఆర్ధిక సహాయం అందించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం మండలం, జగన్నాధపురం గ్రామస్తులు గోపిశెట్టి స్వామి పుల్లారావు లివర్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబాన్నీ పరామర్శించి, వారి వైద్య ఖర్చుల నిమిత్తం బొలిశెట్టి శ్రీనివాస్ గ్రామ జనసేన పార్టీ నాయకులు 65,000 రూపాయలు ఆయన చేతుల మీద ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి రత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి కోట శ్రీరామ్ మరియు గ్రామ జనసేన నాయకులు పల్లంటి సతీష్, అరిగెల కృష్ణ, కోపల్లి జయరాజు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

  • అడ్డగర్ల సత్యనారాయణకు ఆర్ధిక సహాయం అందించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం మండలం, ఆరుగొలను గ్రామం అడ్డగర్ల సత్యనారాయణ ఇటీవల తాపీ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై జారీ పడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నాయకులు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి రత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి కోట శ్రీరామ్, గ్రామ జనసేన నాయకులు అడపా వీరన్న, చిక్కాల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.