అప్పుల కోసం విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే: గాదె

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు లాడ్జి సెంటర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారని, వాటిలో విద్యా వ్యవస్థను ఏవిధంగా నాశనం చేస్తున్నారో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు.ముఖ్యమంత్రి గారి సభల్లో చెప్పే కల్ల బొల్లి మాటలకు చేసే పనులకి ఏ మాత్రం సంబంధం లేదు అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ప్రతి రాష్ట్రానికి విద్యా వ్యవస్థకు డబ్బులు వస్తాయి అని వాటికీ కుడా ఈయన ఏదో ఇచ్చినట్టు ఈయన ఫోటోలు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అన్నారు. అలాగే ఇవి చాలదు అన్నట్టు ఎస్.ఏ.ఎల్.టి అనే వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్ ద్వారా 2021లో సుమారు 2,000 కోట్లు తెచ్చి వాటిని 5 ప్రైవేట్ ఏజెన్సీస్ కి అప్ప చెప్పి ముఖ్యమంత్రి గారికి ఎంతో అనుభవం ఉన్న సూట్ కేసు కంపెనీ విధానాల ద్వారా దోచుకుని రాబోయే ఎలక్షన్స్ లో ఓట్లు కొనే విధానానికి శ్రీకారం చుట్టారు అని ఏద్దేవా చేసారు. అలాగే ఈ 2,000 కోట్లు దోచుకోవడానికి ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా స్కూల్స్ మెర్జింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది అని, దీని మూలంగా సుమారు 3లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుండి డ్రాప్ అవుట్ అయ్యి ప్రైవేట్ స్కూల్స్ లో చేరారు అని అన్నారు.
అలాగే నాడు -నేడు పథకం పెట్టి తన మనుషులకి కాంట్రాక్టు ఇచ్చుకుని నాసిరకంగా పనులు చేసారు అని, అప్పుడే అవి పాడైపోయే పరిస్థితికి వచ్చాయి అని అన్నారు. మరల అదే విధంగా ఈసారి ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఏ విధంగా స్వాతంత్రమునకు పూర్వం ఉన్న ఐదెద్ స్కూల్స్ ని ఏ విధంగా ప్రభుత్వంలో విలీనం చేసి, వాటి భూములు దోచుకోవాలి అని ఎలా ప్రయత్నం చేసారో అదే విధంగా మరల ఈ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ స్కూళ్లను కుడా దోచుకోవాలని ప్రయత్నం అన్నారు. అలాగే ఇటీవల స్కూళ్లలో జరిగిన యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకి క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసే పరిస్థితి లో ఈ ప్రభుత్వం లేదు అని, డి ఈ ఓ టీచర్స్ కి వాట్సాప్ చేస్తే టీచర్స్ ఆ పేపర్స్ ని బోర్డు మీద రాసే దుస్థితికి విద్యా వ్యవస్థ ని జగన్ రెడ్డి తీసుకువచ్చాడు అని అన్నారు. మింగ మెతుకు లేదు గాని మీసాలకి సంపెంగ నూనె అనే విధంగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది అని, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్ డబ్బు లేదు గాని టోఫెల్ శిక్షణ అని చెప్పడం విడ్డురం అని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో 9 వ తారీఖు వచ్చిన గాని టీచర్స్ కి అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు శాలరీస్ రాలేదని, ఈ ప్రభుత్వం ప్రభుత్వ టీచర్లు చలో విజయవాడ అనే కార్యక్రమం చేసినప్పటి నుంచి టీచర్ల మీద పగ పట్టిందని అన్నారు. అలాగే ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో హెడ్మాస్టర్ గా ఉండటం అంటే ఎంతో గౌరవంగా ఉండేదని, కానీ ఈ ప్రభుత్వంలో పాపం అయిపోయిందని అన్నారు. ఎందుకంటే గతంలో స్కూల్ మేనేజ్మెంట్ గ్రాండ్స్ ఉండేవని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని స్కూల్ కు వచ్చే కరెంటు బిల్లులు కూడా హెడ్మాస్టర్లు వాళ్ళ జీతాల నుంచి కట్టుకునే పరిస్థితి అని, ఒక్కొక్క హెడ్మాస్టర్ ఆ స్కూల్ పరిస్థితిని బట్టి ఒక సంవత్సరానికి 70 వేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలియజేశారు. తర్వాత బిల్లులు పెడితే కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని తెలియజేశారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో పెట్టే మధ్యాహ్న భోజనం పథకానికి ఒక వంట మనిషిని పెట్టి వారికి కేవలం నెలకు 3000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారని, దాంతోపాటు ఆ నెలరోజుల పాటు అవసరమయ్యే కూరగాయలు ఇతర పెట్టుబడులన్నీ కూడా అతనే పెట్టుకోవాలని అన్నారు. ఈ నెల పెట్టిన పెట్టుబడి అంతా కూడా వచ్చే నెలలో ఇస్తారని, ఒకవేళ అది ఆలస్యమైతే ఆ బిల్లు వచ్చే వరకు మధ్యాహ్నం భోజనం పథకం ఆ స్కూల్లో ఉండటం లేదని తెలియజేశారు. అలాగే ఈ రాష్ట్రంలో సుమారు 55,000 మంది అంగన్వాడీ టీచర్లు మరియు 55,000 మంది అంగన్వాడీ ఆయాలు ఉన్నారని, వారికి కనీస ఉద్యోగ భద్రత లేదని తెలియజేశారు. అలాగే అంగన్వాడి స్కూల్లో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వారు అసలైన పేదవారని, అమ్మ ఒడి ఇస్తే అలాంటి వారికి ఇవ్వాలని కానీ ఈ ముఖ్యమంత్రి 27 లక్షల మందికి ఇస్తున్నాను అని ప్రగల్బాలు పలుకుతున్నాడని, ఇది కేవలం ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనే ప్రయత్నం అని ఎద్దేవా చేశారు.
అలాగే ఈ ప్రభుత్వం ఈ రోజు నుంచి “వై నీడ్ జగన్ ఫర్ దిస్ స్టేట్” అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమంలో వారు ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నారని, అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని ఆపకుండా ప్రజల్లోకి రానివ్వాలని తెలియజేశారు. అప్పుడు ప్రజలు మీ మాటలు నమ్ముతారో మా మాటలు నమ్ముతారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో తెలుసుకోవాలని, విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరియు మిత్రపక్షాలను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, పట్టణ నాయకులు నెల్లూరు రాజేష్, చింతకాయల శివ తదితరులు పాల్గొన్నారు.