జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బొమ్మిడి నాయకర్

మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరగబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవిర్భావ సభ పోస్టర్ ను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను, జనసైనికులను, వీరమహిళలను మరియు నియోజకవర్గ ప్రజలను కోరారు. అలాగే ఈ రాష్ట్రానికి ఒక్క జనసేన పార్టీ నే ప్రత్యామ్నాయ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, వాతాడి కనకరాజు, వలవల నాని, బందెల రవీంద్ర, నిప్పులేటి తారకరామారావు, కటకంశెట్టి సాయి, పోలిశెట్టి సాంబ, లక్కు బాబి, యడ్లపల్లి మహేష్, జడ్డు మల్లిఖార్జున రావు, కొప్పాడి కనకరాజు, గన్నాబత్తుల ప్రసాద్, యాతం మహేష్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.