పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు

  • గొల్లమందల చిట్టిబాబును పరామర్శించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామ సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబుకి ప్రమాదవశాత్తు చెయ్యి విరిగిందని తెలుసుకుని వారిని రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బళ్ళ రాజబాబు, ఈశ్వరరావు, పోలిశెట్టి గణేష్, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

  • వర్ధనపు సూర్య ప్రకాష్ రావుకు నివాళులర్పించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురం గ్రామం భూపతి వారి పేటలో వర్ధనపు సూర్య ప్రకాష్ రావు మొదటి సంవత్సరికం సందర్భంగా రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.