భృగుబండ, వడ్డెర వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన బొర్రా

  • విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీరు బోరు వేసిన బొర్రా
  • బొర్రానే మా నాయకుడు భృగుబండ వడ్డెర వాసులు

సత్తెనపల్లి బండ బృగుబండ గ్రామంలో శనివారం విజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నెరవేరిన చిరకాలపు కల.గత నాలుగు నెలల క్రితం విజన్ ఫౌండేషన్ వారు వడ్డెర కాలనీలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో త్రాగునీటి సమస్యలను బొర్రాకీ తెలియజేశారు. తక్షణమే స్పందించిన బొర్రా శనివారం గ్రామంలోని వడ్డెర కాలనీకి ఎస్సీ కాలనీకి అనుసంధానంగా మంచినీటి బోరుని వేయించడం జరిగినది. కాలనీవాసులు ఆనందంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. బొర్రాకి రుణపడి ఉంటామని బొర్రా చేసే సహాయాలు ప్రజలు ఎవరు మరువలేనివని మాటిస్తే తప్పని నైజం బొర్రా ది అని మరొకసారి నిరూపించుకున్నారని గ్రామస్తులందరూ ఆయన ఉదార హృదయాన్ని ఆయన సేవలను కొనియాడారు మా కష్ట సుఖాల్లో ఒకడైన మా బొర్రా వెంటే మేముంటాము అని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి ఇనుకొల్లు శివ, మండల కార్యదర్శి బొజ్జ రామకృష్ణ, మండల కమిటీ నెంబరు గొల్లపల్లి ఏసుబాబు, గ్రామ అధ్యక్షుడు గుంజు నాగరాజు మరియు కుంచాల రమణయ్య తురక గోపి తదితరులు పాల్గొన్నారు.