ప్రజా సమస్యలపై బహిరంగ సభలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి: నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో నియోజకవర్గ ప్రజా సమస్యలపై బహిరంగ సభలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంకలగుంట గ్రామ మహిళలు, ప్రజలు హరతులతో బొర్రాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న బొర్రా.. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలవరం పూర్తి కావాలంటే, అమరావతి రాజధాని కొనసాగాలంటే జనసేన టిడిపి ప్రభుత్వం రావాలి. సత్తనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన రావాలంటే జనసేన – టిడిపి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న బొర్రా. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన లేక నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత భారీగా వలస పోతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం మానేసి, ప్రతిపక్షాల గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కార్. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూషించడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికలలో ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారన్న బొర్రా. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, పట్టణ నాయకులు, నాలుగు మండలాల అధ్యక్షులు, గ్రామ నాయకులు, తదితరు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.