వందేమాతరం అశోక్ ని పరామర్శించిన తంబళ్లపల్లె రమాదేవి

నందిగామ నియోజకవర్గం: శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర గోప్రముఖ్ వందేమాతరం అశోక్ ని జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి తంబళ్లపల్లె రమాదేవి పరామర్శించారు. గత రాత్రి పట్టణంలోని అయ్యప్ప స్వామీ గుడి వద్ద ధార్మిక కార్యక్రమం పని మీద వెళ్ళిన వందేమాతరం అశోక్ ని మద్యం మత్తులో త్రాగి డ్రైవ్ చేస్తున్న ఒక యువకుడు ఆగి ఉన్న వందేమాతరం అశోక్ ని ఢీకొట్టిన ఘటనలో అశోక్ ఎడమ కంటికి తీవ్ర గాయం అవ్వడం జరగింది. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి గరుబీ సాయంత్రం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి సతీమణికి ధైర్యం చెప్పడం జరిగింది. నిత్యం ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న అశోక్ గారిని చాలా పెద్ద ప్రమాదం నుండి కొంత మేర దైవం కాపాడిందని అయినా మున్సిపల్ కార్యాలయం నుండి అయ్యప్ప స్వామీ గుడి వరకు అధికార పార్టీ రోడ్డు పరిధి పెంచి డివైడర్ ఏర్పాట్లు చేయకుండా వదిలి వేయడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో కూడా ఈ రోడ్డులో చాలా మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని తక్షణమే ఆ రోడ్డుకు డివైడర్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్, స్థానిక శాసన సభ్యులు చొరవ తీసుకుని ప్రయాణ చోదకుల ప్రాణాలు కాపాడాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్, కార్యదర్శి తెప్పలి కోటేశ్వరరావు, కొట్టే బద్రి వీరమహిళ కొట్టే వెంకట నరసమ్మ శ్రీ రామ్ వర్ధన్ పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.