సత్తెనపల్లి నియోజకవర్గంలో బొర్రాకి ఎమ్మెల్యే టికెట్ రావాలి

సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుకి ఎమ్మెల్యే టికెట్ రావాలని సత్తనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు నకరికల్లు మండలంలోని చేజర్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి వారి ఆలయంలో 101 కొబ్బరికాయలను కొట్టారు. నియోజకవర్గంలో అప్పారావు చేసిన కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు మరువలేనివని నాదెండ్ల నాగేశ్వరరావు అన్నారు. వారితో పాటు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు.