అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

బెండపూడి అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ యూత్ కమిటీ అధ్యరంలో ఏర్పాటు చేసిన విందు భోజనాల కార్యక్రమంలో వారి ఆహ్వానం మేరకు తొండంగి మండల జనసేన అధ్యక్షులు బెండపూడి నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెండపూడి గ్రామ అధ్యక్షులు కోరుకొండ శివ, తొండంగి మండల సంయుక్త కార్యదర్శి గోపిశెట్టి నాగేంద్ర, బెండపూడి గ్రామ కమిటీ సబ్యులు సోము, సోమిశెట్టి శివ, తదితర గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.