యు.డి.ఎఫ్ ఎగ్జామ్ టైముకి కండక్ట్ చేయాలని జనసేన జానీ డిమాండ్

శ్రీకాకుళం జిల్లా బి.ఆర్.ఏ.యు పరిధిలోని గత విద్యా సంవత్సరం డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు నేటికీ 6 నెలలు గడిచినా పరీక్ష ఫలితాలు ప్రకటించపోవడానికి గల కారణాలేమిటో తెలపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్య పరిష్కారం అవ్వకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. యు.డి.ఎఫ్ ఫీజు టైంకి కట్టించుకుంటున్నారు కానీ ఎగ్జామ్ మాత్రం టైంకి 6 నెలలు అవుతున్నా కండక్ట్ చేయడం లేదని, అలాగే వాల్యుయేషన్ కూడా కరెక్ట్ గా చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీన్ని త్వరలో పరిష్కరించకపోతే ఉత్తరాంధ్ర జనసేన అధినాయకులు పర్యటనలో విద్యార్థులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులు దీనిపై రోడ్లపైకి వస్తే దీని ఫలితం ప్రభుత్వమే భరించాలని జనసేన జానీ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కరించవలసిందిగా విద్యార్థులతో పాటు జనసేన పార్టీ తరపు నుంచి జనసేన జానీ కోరడమైనది. లేదంటే విద్యార్థులు యూనివర్సిటీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. ఎంతలా కష్టపడి మంచిగా ఎగ్జామ్ రాసిన ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ కేవలం ఫీజులు కట్టించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విద్యార్థుల్లో మొదలైన ఆలోచన ఇలాగే కొనసాగితే విద్యార్థులు పక్క జిల్లాలకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జనసేన జానీ హెచ్చరించడం జరిగింది.