శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, బొర్రా వెంకట అప్పారావు రాజుపాలెం మండలంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంకు నియోజకవర్గంలోని జనసైనికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ పిఠాపురం ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసినదే మరలా తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలవాలని కొళ్ళురు ప్రసన్నాంజనేయ స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. అలానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరిగి జనసైనికులను, వీర మహిళలను కలిసి రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసైనికులు అందరూ వారి వారి మతాల ఆచారాలకు అనుగుణంగా ప్రార్థనలో చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ఇనుకొల్లు శివ, చిలక పూర్ణ, అంచుల ఉదయ్ భాస్కర్, టి.మహేష్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.