డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో మేధోమథన కార్యక్రమం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం మండల కేంద్రంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో మేధోమథన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మేధో మధనం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ డా. యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఉన్నతమైన చరిత్ర, మహోన్నతమైన వారసత్వం కలిగిన ఈ దేశంలో, ప్రత్యేకంగా దేవాలయం లాంటి జనసేనలో జీవిస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంధకారమనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుతురు వైపు కాగడ పవన్ కళ్యాణ్ అని ఉద్బోధించారు. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వర్ణించారు. జీవితాన్ని మీరు మీకు కావలసిన రీతిలో రూపుదిద్దుకోండి, ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పడం కాదు, మనలో చేయించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. కష్టాలలో యాతన కన్నా విజయాన్ని సాధించాలన్న తపన మిన్న అని ప్రతి ఒక్కరూ స్వీకరించిన పదవుల ప్రకారం మీ వంతు ఉమ్మడిగా కృషి చేయాలనీ, అప్పుడే విజయం సాధించి సాధ్యమని తెలిపారు. మనిషి అంతర్మధనం చెందడం కాదు, అంతర్వాణిని వినడం కూడా అలవాటు చేసుకోవాలని అప్పుడు జీవితం వీణా నాదంగా ఉంటుందని, అప్పుడు మీ నాదాన్ని అందరూ వినగలుగు తారని, అదే విజయమని తెలియజేసారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో జ్వలించాలని, సాధనలో రేటుదేలాలని, గమ్యంలో సేద తీరాలని, అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. జీవితం ఆపై మరణం, తరువాత శరీరం మంటలో కాలిపోవడం లేదా మట్టిలో కలిసి పోవడం కాదు, జీవిత కాలమంతా ప్రజలకు మేలు చేయడం, ప్రజల కష్టాలలో అండగా నిలబడడం అని తెలిపారు. బూత్ కమిటీ నిర్మాణం పూర్తి చేసినందుకు నాయకులను ఈ సందర్భంగా అభినందించారు. జనం కోసం జనసేన కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేయాలని, జటిలమైన సమస్యల కోసం పాదయాత్ర నిర్వహించాలని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని, ధైర్యంగా ముందడుగు వేయండని, మన వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీకండగా జిల్లా నాయకత్వం ఉందని, గ్రామస్థాయిలో ఉన్న జనసైనికులకి మీరందరూ అండగా నిలబడాలని, తుది శ్వాస విడిచ్చేంత వరకు మీకు, ప్రజలకి నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈసారి నియోజకవర్గంలో జనసేనదే గెలుపని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, గంగాధర నెల్లూరు మండల ఉపాధ్యక్షులు వేంకటాద్రి, యస్ ఆర్ పురం మండలం అధ్యక్షులు చిరంజీవి, కర్వేటినగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, సెల్వి, ప్రధాన కార్యదర్సులు వెంకటేష్, నరేష్, చంద్రమౌళి, నరసింహులు, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్సులు భాను ప్రకాష్, రాఘవ, పాలసముద్రం మండల ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి ఆకాష్, గంగాధర నెల్లూరు మండల ప్రధాన కార్యదర్శి శివ, సంయుక్త కార్యదర్శి కేశవులు, జనసేన నాయకులు భరత్, శివ, అజయ్ పాల్గొన్నారు.