ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : గాదె వెంకటేశ్వరరావు

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా అధ్యక్షులు పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు ఏమైంది..? ఎందుకు ఇంకా బాధితుల కుటుంబాలకు అందజేయలేదు అసలు ఆ చెక్కు ఎక్కడ ఉందో రాష్ట్ర ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు తెలియజేయాలని, మేము గాని మా పార్టీ గాని రాంబాబుని ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదు, ప్రమాదంలో కొడుకుని కోల్పోయి, ఉన్న ఒక్కగానొక్క ఒక్క కూతురిని చదివించుకోవడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన ఆ చెక్కును ఇవ్వమనే అడిగాము తప్ప ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని మేము అడిగితే మేమేదో వాళ్లకు డబ్బులు ఇచ్చి మీడియా ముందు మాట్లాడిస్తున్నామని ఒక మంత్రి హోదాలో ఉండి మీడియా ముందుకు వచ్చి అసత్యాలు పలుకుతున్నారు. అయ్యా మంత్రిగారు మేము ఎలా ఇస్తాము డబ్బులు మీలాగా మేము లాటరీ టికెట్లు ఏమి అమ్ముకోవట్లేదు కదా రాజుపాలెం నకరికల్లు మండలాల్లో మైనింగ్ మేం చేయట్లేదు కదా వేలకు వేలా ట్రక్కులు మట్టి తోడుకొని కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. మీలాగా మా దగ్గర అక్రమ సంపాదన డబ్బులు అయితే ఏమీ లేవు కదా ఇవ్వటానికి. గవర్నమెంట్ నుంచి వచ్చిన చెక్కి ఇవ్వడానికి నానా యాగి చేసావు నువ్వు, నువ్వే రోడ్డున పడ్డావు. నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం మా మీద బురద చల్లుతున్నావు. గంగమ్మ కుటుంబానికి వాళ్ల కుమారుడు పేరు మీద ఐదు లక్షల రూపాయల చెక్కు వచ్చిన మాట వాస్తవం. దాంట్లో రెండు లక్షల 50 వేలు వాటా అడిగిన మాట వాస్తవం. నువ్వు ఒక మంత్రివి అయితే నువ్వు చెప్పుకునే విధంగా నీతి నిజాయితీ ఉన్నవాడిని ఒకరి డబ్బుకి ఆశపడను అని నీతులు చెప్పే అంబటి… గంగమ్మ కుటుంబానికి వచ్చిన ఆ ఐదు లక్షల రూపాయలు చెక్కు ఎక్కడ ఉంది వెనక్కి పంపేసావా, చించేసావా, దాచుకున్నావా ఏం చేసావో చెప్పు నీ దగ్గర ఉంటే వెంటనే ఆ కుటుంబానికి అందజేయండి. మీరు అందజేయని పక్షాన నేను మా పార్టీ తరపున వాళ్లకి చెక్కు వచ్చేంతవరకు సత్తెనపల్లి నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను. కొడుకును పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి ఇంత గొడవైన్ తర్వాత నేను వాళ్లకి ఎందుకు ఆ చెక్కు ఇవ్వాలి అని కూడా మాట్లాడుతున్నారు. అయ్యా మంత్రి గారు ఆ డబ్బులేమీ మీ అకౌంట్లో నుంచి తీసి ఇవ్వట్లేదు అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తున్నారు దయచేసి ఆ కుటుంబానికి వచ్చిన చెక్కు ఆ కుటుంబానికి ఇవ్వండి లేదంటే మా పార్టీ తరఫున ఆ చెక్కు ఇచ్చేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము.

బాధితురాలు గంగమ్మ మాట్లాడుతూ అయ్యా అంబటి రాంబాబు మీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగత తగాదాలు లేవండి మా కొడుకుకు వచ్చిన ఐదు లక్షల రూపాయలు చెక్కులో రెండున్నర లక్షల డబ్బులు మీరు అడిగారని నేను బాధపడుతూ జనసేన పార్టీని ఆశ్రయించాను తప్ప నాకు వాళ్లు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఇస్తానని నాతో ఈ మాటలు మాట్లాడించట్లేదు. దయచేసి నాకు వచ్చిన చెక్కును నాకు ఇచ్చి నా కుటుంబానికి మీరు న్యాయం చేయండి. ఈ గొడవ జరిగిన దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్లలేక పోతున్నాను. అయ్యా నాకు న్యాయం చేయండి అని తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, మండల అధ్యక్షులు తోట నరసయ్య, తాడువాయి లక్ష్మి, నాదెండ్ల నాగేశ్వరరావు, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం, వల్లెం శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, తిరుమలశెట్టి సాంబ, సుబ్బారావు, అమరగుత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.