శ్రీ పవన్ కళ్యాణ్ తో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్ పాల్గొన్నారు.