16న మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

వర్తమాన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు, కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, నగర అధ్యక్షులు ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.