రాష్ట్ర సాయిధరంతేజ్ యువత ఆధ్వర్యంలో ఘనంగా “బ్రో” చిత్రం విజయోత్సవ వేడుకలు

గుంతకల్ పట్టణంలో “బ్రో” చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా గుంతకల్ పట్టణం ఎస్ఎల్వి థియేటర్ నందు రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణ అధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, ఎస్ ఎల్ వి థియేటర్ ప్రొప్రైటర్ విజయ్ కుమార్, డిస్ట్రిబ్యూటర్ మల్లికార్జున, థియేటర్ మేనేజర్ విరూపాక్ష సమక్షంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో ఈ భూమ్మీదకి మనము అతిథులుగా వచ్చామని ఉన్నన్నాళ్ళు పంచభూతాలను, సహజ వనరులను, ప్రకృతిని గౌరవిస్తూ బతకాలే తప్ప, వాటిని స్వార్థం కోసం నాశనం చేస్తూ జీవించకూడదు, అనేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మెగా అభిమానులుగా, జనసైనికులుగా సామాజిక బాధ్యతతో సేవా గుణంతో, మీరు అందించిన స్ఫూర్తితో సమాజం పట్ల గౌరవంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఎస్ ఎల్ వి థియేటర్ ప్రొప్రైటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సినిమా చూస్తున్నంతసేపు భగవద్గీత గుర్తుకొచ్చిందని ఇలాంటి గొప్ప సినిమా అందించినందుకు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, చిత్ర డైరెక్టర్ మరియు నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి బి గోపి, గుంతకల్ పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర కాపు సంక్షేమ నాయకులు బుర్ర అఖిల్ మెగా అభిమానులు, జనసైనికులు రామకృష్ణ, కొనకొండ్ల శివ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, కృష్ణ, శేఖర్, మంజునాథ్, అనిల్, అల్లు రవి, హరీష్, ఆటో బాషా, పరుశురాం, సూరి, కసాపురం రామాంజనేయులు, సూర్యనారాయణ, శివ, బన్నీ, కసి, శ్రీనివాసులు, రామాంజనేయులు, శ్రీరామ్ ఫైనాన్స్, వాసు తదితరులు పాల్గొన్నారు.