శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బుల్లెట్ కలకలం రేపింది. విమానాశ్రయంలో లగేజ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో బ్యాగ్‌లో బుల్లెట్ కనిపించింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ లభ్యంపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.