పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ వారం మొదట్లో అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. పుదుచ్చేరి ఏప్రిల్‌మే నెలల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.