హత్రాస్ కేసు పై సీబీఐ దర్యాప్తు

హత్రాస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, కేసును సీబీఐకి అప్పగించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు కలిసి మాట్లాడిన తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఈ కేసులో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురై మరణించిన బాధితురాలి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది. బాధితురాలి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించకుండా అంత్యక్రియలు చేయడం వెనుక కారణాలు ఏంటి అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురుకావడంతో యోగిసర్కార్ ఈ కేసును సీరియస్ గా తీసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.